Wednesday, December 9, 2009

నాగరికత శాకాహారం

మనిషి మొదట దొరికింది తిని బ్రతికాడు.
అవి ఆకులు ,అలములు ,కాయలు ,పండ్లు లేక ఇతర జంతువుల్లా ..అందిన మిగతా జంతువులు.
తర్వాత నెమ్మదిగా ..కాల్చుకొని ..తిన్నాడు .క్రమంగా అందులో ఉప్పో కారమో లేక ఇతర దినుసులో కలిపి ..కాల్చుకునో ,ఉడికించో రుచికి ప్రాధాన్యత ఇచ్చి ..
మనిషీ నాగరికత చెందుతున్నకొలది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి ..
మనిషికి ..సాటి మనుషుల పట్ల ,,ప్రకృతి పట్ల ..ప్రకృతిలో ఇతర జీవరాసి పట్ల ..ప్రేమ సుహృద్భావం ..కలగటం సహజం ..ప్రకృతిలో ..సహజీవులయిన జంతువులని వేటాడి, వధించి ..భుజించడం ..నాగరికమానవుడికి .. సంశయం ..లాగా తోచింది .

ఈనాటికి ..నేడు . ..మనం ,, విలవిల లాడుతున్నా ..కోడి పిల్లలని సైకిల్ .హాండిల్ కి వేళ్ళాడేసుకుని ..స్కూటర్ ..కి ముందు కొన్ని, వెనకాల సీటుకి .. అటు ఇటు తల్లకిందులా
బజారులో చూసి ..జాలిపడమా...ఇక వాటిని వధ్యశాలకి తరలించి ..ఒక్కూక్క కోడి మెడ కొద్దిగా గాటు పెట్టి ..రక్తం చిమ్ముతూ వాటిని కుప్పలాగా పారేసి ..తీరికగా ఒక్కొక్క పక్షి రెక్కలు వలచి ..
మొన్న ..ఆదివారం జ్యోతి దినపత్రికలో .. మేనకా గాంధీ ..కుందేళ్ళని ..అతి ఇరుకయిన ..ఇనుపతీగల బోనులో పెంచే,, పట్టుకువెళ్ళే ..విధానం ..వాటిని బోనులో కుక్కి ..వాటి పాదాలు కింద, బోను తీగలకి ..చీరి ..అవి .ఘోరంగా ఆక్రోసిస్తుంటే ..వాటిని .బండ కేసి బాది..చర్మం వలిచి ..వాటి మాంసం ..అమ్మకానికి ..పెట్టడం ..ఇలా ..ఎన్నో ..క్రూర పద్ధతులు ..
అలాగే ఆవుల్ని ,మేకల్ని ..వధ్యశాలలో ..అతి దారుణంగా ..భయపడేలాగా ..నిర్దాక్షిణ్యంగా ..కాస్త కాస్త గొంతు కోసి ..రక్తం ఏరులయి ప్రవహిస్తుంటే ..నెమ్మది నెమ్మదిగా ..చెర్మం వలచి ..వధిస్తారట ..
నేడు ..మనలో ..చాలా మంది ... ఇవన్ని చూసి సహించలేరు ...
.వీటన్నిటికి అతీతంగా ..నీట్ గా ..వేడి వేడి గా ..ప్లేట్ లో .అందంగా అలంకరించిన మాంసాహారం ..అసలు స్పృహ కలగకుండా ..ఎలాతయారయింది ..అని
ఆలోచించకుండా ..ఆస్వాదించాలి ..నాగరికత ..నాజూకు ..పర్యావరణ స్పృహ ..sensitivity
అనేది లేకుండా ...
.మనిషికి ఆహారపు అలవాట్లకి ..sophistication కి ..సంబంధం ఉన్నదేమో ...
ఇక మనిషీ జీర్ణవ్యవస్థ కూడా ..మాంసాహారానికి అనువుగా ..తయారవలేదని విన్నాను ..
పర్యావరణ రక్షణ రీత్యా ..శాకాహారం క్షేమకరమట...
సంస్కృతి .సాంప్రదాయం ..పక్కనపెడితే ....
జీవహింస చేసి ..వన్యప్రాణులని.భుజించడం ..నాగరిక లక్షనమేనా ?
అవును ..ప్రపంచ జనాభాలో 99%.మాంసాహారం చేస్తారు ..అనాగరికులు అనలేముకదా..
నాకయితే మనిషి ..పరిణతి చెందినకొద్దీ ..శాకాహారిగా మార్పుచెందుతాడని..అభిప్రాయం .